Dichpally: డిచ్‌పల్లి మండల సర్వసభ్య సమావేశంలో జెడ్పీ సీఈవో సాయగౌడ్
Dichpally: డిచ్‌పల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ. జలసిరి, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి బిల్లులపై చర్చించిన సర్పంచులు, అధికారులు.
Dichpally: డిచ్‌పల్లి మండల సర్వసభ్య సమావేశంలో జెడ్పీ సీఈవో సాయగౌడ్
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం రోజు ఎంపీడీవో ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిచారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ సీఈవో సాయగౌడ్ హాజరై ఈ సందర్బంగా మాట్లాడుతు.జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా చేపట్టాలని, సమస్యల పరిష్కారానికి ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం ఉపయోగపడుతుందని అన్నారు.
వీబీజీ రామ్-జీ సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ప్రతి పంచాయతీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 130 పనులు పూర్తి చేయాలని కోరారు.ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, శానిటేషన్, ఉపాధి హామీ పనులు, గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు కావాలని కోరారు.
ధర్మారం-బి గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సహకరించగలరని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ బిల్లులు చెల్లించడంలో ఇబ్బందులు పెడుతోందని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు అధికారుల దృష్టికి తెచ్చారు. యానంపల్లి, కొరట్పల్లి, సుద్దులం గ్రామాల ఉపాధి కూలీలకు ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని తెలిపారు.
గ్రామల అభివృద్ధి కోసం అధికారులు సహకరించలని సర్పంచ్ లు కోరారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో సాయగౌడ్ ఎంపీడీవో ఉదయ్ భాస్కర్,డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్.ఐ సంతోష్, ఆర్.అండ్.బి శ్రీధర్, హౌసింగ్ ఏ.ఈలు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.




