Nizamsagar: కాంగ్రెస్ కమిటీల కసరత్తు.. త్వరలో ఊరూరా జెండా పండుగ
Nizamsagar: నిజాంసాగర్‌లో కాంగ్రెస్ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సదస్సు.
Nizamsagar: కాంగ్రెస్ కమిటీల కసరత్తు.. త్వరలో ఊరూరా జెండా పండుగ
నిజాంసాగర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని త్వరలోనే మండల, గ్రామ స్థాయి కమిటీలను నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ప్రజా పండరి తెలిపారు. గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని సర్పంచ్, గ్రామ కమిటి అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పండరి మాట్లాడుతూ త్వరలో పార్టీ ఆదేశాల మేరకు మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామన కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వేరని ఇప్పుడు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మార్గ దర్శకంలో కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
పార్టీ నూతన కార్యక్రమమైన సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో రాష్ట్ర పి సి సి అబ్జర్వార్ ఎ ఐ సి సి అబ్జర్వార్ నియమించి క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త అభిప్రాయాలు తెలుసుకొని పార్టీ పదవులైన ఎం సి సి, డి సి సి, పి సి సి, ఎ ఐ సి సి అధ్యక్ష పదవులను నియమిస్తుందని అన్నారు. ఇది ఇప్పటివరకు ఎ పార్టీ లో జరుగని ప్రక్రియ అని రాబోయే యువ నాయకులకు ఆత్మ స్థైర్యాన్ని నింపిందన్నారు.
జుక్కల్ నియోజకవర్గం లొ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులలో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తగిన స్థానం కల్పిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 న పథకాల జాతర పేరుతో పెన్షన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని దానికి సంబంధించిన గ్రామ స్థాయి సర్పంచ్‌లు, గ్రామ అధ్యక్షులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోని అర్హులైన వారి జాబితా ను తయ్యారు చేయాలని సూచించారు.
రానున్న రోజుల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాలు, పార్టీ అదేశాలు, సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని పార్టీని ముందుకు నడిపించడంలో తన వంతు క్రుషి చేస్తానని అన్నారు. కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఫోరం అధ్యక్షడు లక్ష్మయ్య, సర్పంచ్‌లు అంజయ్య, గుర్రపు సుమిత్ర శ్రీనివాస్, బ్రహ్మం, పోచయ్య, నందష్ మోహన్, నారాయణ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాకలి సాయిలు, ఆజ్యం దుర్గయ్య, చిరంజీవులు, సలీం, దుర్గయ్య శ్రీనివాస్ రెడ్డి, రాజారాం, కృష్ణ అజయ్ కుమార్, హనీష్ పాటిల్, మీన సింగ్ లతోపాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




