Nizamsagar: నిజాంసాగర్ మండలంలో కాంగ్రెస్ గ్రామ కమిటీల నియామకం!
Nizamsagar: నిజాంసాగర్ మండలం బంజేపల్లి, సుల్తాన్ నగర్లలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల నియామకం. రమేష్, చంద్ పాషాలకు బాధ్యతలు అప్పగించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్.
Nizamsagar: నిజాంసాగర్ మండలంలో కాంగ్రెస్ గ్రామ కమిటీల నియామకం!
నిజాంసాగర్: బంజే పల్లి (కామారెడ్డి ) నిజాంసాగర్ మండలం లొని బంజే పల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి ల నేతృత్వంలో గ్రామ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష, కార్యదర్శుల నియామకాలు జరిగాయి.
ఈ సందర్బంగా బంజే పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాండ్ల రమేష్, సుల్తాన్ నగర్ గ్రామ అధ్యక్షుడిగా షేక్ చంద్ పాషాలు ఎన్నికయ్యారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూనే,పార్టీ ని గ్రామస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పార్టీ సిద్ధాంతలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటు పార్టీ అభివృద్ధి కి కృషి చెయ్యడం వంటి బాధ్యతలను నూతనంగా నియమితులైన అధ్యక్షులు నిర్వర్తించాలని సూచించారు.
గ్రామ స్థాయినుండి ఎన్నికౌతున్న నూతన అధ్యక్షుల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయాన్ని ఆకాంక్షించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




