Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నీట మునుగుతున్న యువకుడి రక్షణ!
Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద స్నానానికి దిగి నీట మునుగుతున్న ముజాకీర్ అనే యువకుడిని స్థానిక యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు.
Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నీట మునుగుతున్న యువకుడి రక్షణ!
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద సరదాగా స్నానానికి దిగినఓయువకుడుప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోగా, చేపలు పట్టేందుకు వచ్చిన ఓ యువకుడు తన గుండె ధైర్యం తో సాహసోపేతంగా అతడిని కాపాడాడు. స్థానికులు వెంటనే సీపీఆర్చేయడంతోయువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బాన్సువాడ కోట్‌గల్లీకి చెందిన 18 ఏళ్ల ముజాకీర్ తనస్నేహితులు అమ్మన్, నాగార్జున్‌తో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌నుచూసేందుకువచ్చాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో ముగ్గురు స్నానానికి దిగగా ముజాకీర్ ఒక్కసారిగా లోతైన నీటిలో మునిగిపోయాడు.
అదే సమయంలో చేపలు పట్టేందుకు వచ్చిన నిజాంసాగర్‌కు చెందిన సయ్యద్ సయీద్ ఒద్దిన్ కేకలు విని వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రాజెక్ట్ నీటిలోకి దూకి ముజాకీర్‌ను బయటకు తీసుకొచ్చాడు. స్థానికుల సహకారంతో సీపీఆర్ చేయడంతో యువకుడు స్పృహలోకి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. సయ్యద్ సయీద్ ఒద్దిన్ ధైర్య సాహసాన్ని స్థానికులు అభినందించారు.




