Armoor: ఆర్మూర్ రైతులకు హార్టికల్చర్ అధికారుల దిశానిర్దేశం
Armoor: నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Armoor: ఆర్మూర్ రైతులకు హార్టికల్చర్ అధికారుల దిశానిర్దేశం
Armoor: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో మంగళవారం హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగులో ఉన్న అవకాశాలు, లాభాలు, సాంకేతిక పద్ధతులు, పరిశోధన అంశాలపై రైతులకు వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
కార్యక్రమంలో హార్టికల్చర్ జెడిహెచ్ బండారి శ్రీనివాస్, అగ్రికల్చర్ జెడిఏ గీతారెడ్డి, ఏడిఏ విజయలక్ష్మి, హార్టికల్చర్ హెచ్ఓ సంధ్యారాణి, ఫ్రీ యూనిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ రాజశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ కే. పురుషోత్తమరాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఐదు మండలాల సర్పంచులు, వ్యవసాయ మరియు హార్టికల్చర్ అధికారులు, సెరికల్చర్ అధికారులు, రైతులు మరియు అంకాపూర్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




