Bodhan: అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ: బోధన్ ఆర్డీవో విజయకుమారి!

Bodhan: బోధన్‌లో అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం ఘనంగా నిర్వహణ. అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించవచ్చని బోధన్ ఆర్డీవో విజయకుమారి పిలుపు.

K RAVI, BODHAN
Published on: 13 Aug 2026 6:45 PM IST
Bodhan
X

Bodhan: అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ: బోధన్ ఆర్డీవో విజయకుమారి!

బోధన్: అవయవ దానంతో ఒక జీవితాన్ని కాపాడవచ్చు అని బోధన్ ఆర్డివో విజయకుమారి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో లైన్స్ క్లబ్, అవయవదాన సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవయవదానంతో ఒక వ్యక్తికి పునర్జన్మను ఇచ్చిన వారవుతామని ఆమె పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి తన అవయవాలను దానం చేయడంతో మరుజన్మల సైతం ప్రపంచాన్ని చూడగలుగుతారని ఆమె ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ అవయవదానాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సదస్సులో లైన్స్ క్లబ్ చైర్మన్ బసవేశ్వర రావు, ఇందూర్ విద్యాసంస్థల అధినేత కొడాలి కిషోర్, అవయవ దాన సంస్థ చైర్మన్ కాట్రగడ్డ భారతి, లైన్స్ క్లబ్ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ పహాడే పలు విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story