Bichkunda: అతిథి అధ్యాపకులకు పూర్తి పారితోషికం ఇవ్వాలి
Bichkunda: ప్రభుత్వ సెలవుల్లో వేతన కోత విధించకుండా అతిథి అధ్యాపకులకు పూర్తి పారితోషికం చెల్లించాలని బిచ్కుంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించారు.
Bichkunda: అతిథి అధ్యాపకులకు పూర్తి పారితోషికం ఇవ్వాలి
బిచ్కుంద (కామారెడ్డి): బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతి పత్తి ) లో విధులు నిర్వహిస్తున్న అతిథి అధ్యాపకుల ప్రభుత్వ సెలవులు మినహాయించకుండా నెలవారీ పూర్తి కన్సాలిడేటెడ్ పారితోసికం చెల్లించాలని కోరుతు కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ కు గెస్ట్ ప్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎం డి గౌసోద్దిన్, ఉపాధ్యక్షుడు ఆర్. ప్రశాంత్ రెడ్డి లు మాట్లాడుతు ప్రస్తుత నెలలో వచ్చే పండుగలైన విజయదశమి, సంక్రాంతి సెలవులతోపాటు ఇతర ప్రభుత్వ సెలవులతోపాటు ఇతర సెలవులను మినహాయించి, మిగిలిన పని రోజులకు మాత్రమే పారితోషికం చెల్లించడం జరుగుతుందన్నారు. దీని కారణంగా గెస్ట్ ప్యాకల్టీ లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సెలవుల పేరుతో పారితోషికం లో కోత విధించకుండ నేల మొత్తం పూర్తి స్థాయి కన్సాలిడేటెడ్ పారితోషికం చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పై ఉన్నత స్థాయి విద్య మండలికి సానుకూలంగా సిపర్సు చేసి గెస్ట్ ప్యాకల్టికి న్యాయం జరిగేలా చూడాలని ప్రిన్సిపాల్ ను కోరారు. కార్యక్రమం లో కళాశాల గెస్ట్ ప్యాకల్టీ లు పాల్గొన్నారు.




