Bichkunda: రేషన్ షాప్ లో నాణ్యత లేని బియ్యం సరఫరా

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద 17వ రేషన్ షాప్‌లో నూకలు, మెరిగెల బియ్యం ఇస్తున్నారంటూ వినియోగదారుల ఆవేదన. డీలర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి.

VEERANNA, JUKKAL
Published on: 23 Aug 2026 4:17 PM IST
Bichkunda
X

Bichkunda: రేషన్ షాప్ లో నాణ్యత లేని బియ్యం సరఫరా

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి ) బిచ్కుంద పట్టణంలోని 17వ రేషన్ షాపులో నాణ్యత లేని బియ్యాన్ని పంపిణీచేస్తున్నారని పలువురు రేషన్ కార్డుదారులు ఆరోపిస్తున్నారు. రేషన్ షాపు డీలర్ వినియోగదారుల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తూ, మెరిగెలు, నూకలు ఉన్న బియ్యాన్నితూకంవేసిఇస్తున్నారనివారువాపోతున్నారు.

నాణ్యత లేని బియ్యం ఎందుకు ఇస్తున్నారని వినియోగదారులు ప్రశ్నించగా, ‘‘నేను ఇలాంటి బియ్యమే ఇస్తాను.. ఇష్టముంటే తీసుకెళ్లండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళండి,ఎవరికైనా చెప్పుకోండి’’ అంటూ డీలర్ దురుసుగా సమాధానం ఇస్తున్నారని కార్డుదారులు ఆరోపిస్తున్నారు.

రేషన్ బియ్యం తీసుకునే వినియోగదారులతో డీలర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం నాణ్యతపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, 17వ రేషన్ షాపును తనిఖీచేయాలనివినియోగదారులుకోరుతున్నారు.

నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తేలితే సంబంధిత రేషన్ డీలర్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, కార్డుదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story