Nizamabad: బోధన్‌లో పీడీఎస్ బియ్యం దందా: 193 క్వింటాళ్లు స్వాధీనం
Nizamabad: బోధన్ శ్రీ సాయి ఆగ్రోస్ రైస్ మిల్లుపై పోలీసుల దాడి, 193 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.
Nizamabad: బోధన్‌లో పీడీఎస్ బియ్యం దందా: 193 క్వింటాళ్లు స్వాధీనం
నిజామాబాద్: బోధన్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో సోమవారం రాత్రి సిసిఎస్ పోలీసులు శ్రీ సాయి ఆగ్రోస్ రైస్ మిల్ పై దాడి చేసి భారీగా పీడీ ఎస్ బియ్యాన్ని పట్టుకున్నరు. బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులు ఏసీపీ మస్తాన్వలి బృందం దాడి చేసి సుమారు 193 క్వింటాళ్ల అక్రమ పిడిఎఫ్ బియ్యాన్ని సాధనపరచుకున్నట్లు వెంకటనారాయణ తెలిపారు. లారీలో ఉన్న 193 కింటాల్లా పిడిఎస్ బియ్యంతో పాటు లారీని స్వాధీన పరుచుకొని ఎన్ఫోర్స్మెంట్ డిటి హనుమంతు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు అండతోనే : బోధన్ డివిజన్ పరిధిలోని పలు రైస్ మిల్లు బియ్యం నిల్వ ఉన్నప్పటికీ సివిల్ సప్లై అధికారుల నిఘా కొరవడంతో బోధన్ డివిజన్లో భారీగా పిడిఎస్ బియ్యం దందా కొనసాగుతుందని కొనసాగుతుందని పలు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పెగడపల్లిలో సైతం ఓ రైస్ మిల్లులో భారీగానే సిసిఎస్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.




