Kamareddy: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దు
Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్ద ఏడ్గి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్ సందర్శించారు.
Kamareddy: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దు
Kamareddy: పెద్ద ఏడ్గి (కామారెడ్డి) అంగన్వాడీ కేంద్రం సక్రమంగా పని చేయాలని చిన్న పిల్లలు, గర్భిణి, బాలింత స్త్రీలకు ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్ ఆస్పత్వర్. అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. కేంద్రం లోని చిన్నారులకు అందిస్తున్న పోస్తకహారం, విద్య కార్యక్రమాలు, పరిశుభ్రత వంటి అంశాలపై ఆయతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రం లో పిల్లల ఆరోగ్యం అభివృద్ధి కి ఎలాంటి లోటు లేకుండా చూడాలని అంగన్వాడీ టీచర్ ను సూచించారు. కేంద్రం లో అవసరమైన సదుపాయాల గురించి వెంటనే తమకు తెలియజేయాలని గ్రామాభివృద్ధిలో అంగన్వాడీ ల పాత్ర ఎంతో కీలకమని, పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రాలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం లో ఐక్యత యూత్ అధ్యక్షుడు రవీందర్, గ్రామ పెద్దలు ఆస్పత్వర్. పండరి, సాయి బాబా, సునీల్, శ్రీనివాస్, మంగలి హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.




