Nizamabad: నిజామాబాద్‌లో పేరిణి నాట్యం పరీక్షలు విజయవంతం

Nizamabad: నిజామాబాద్‌లోని విశ్వ వికాస్ హైస్కూల్‌లో శ్రీ సమ్మోహన నృత్యాలయం ఆధ్వర్యంలో పేరిణి నాట్యం విశారద–ప్రవేశిక పరీక్షలు విజయవంతంగా ముగిశాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 25 Oct 2026 8:57 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్‌లో పేరిణి నాట్యం పరీక్షలు విజయవంతం

నిజామాబాద్‌: నిజామాబాద్‌లోని విశ్వ వికాస్ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం శ్రీ సమ్మోహన నృత్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పేరిణి నాట్యం విశారద–ప్రవేశిక పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. భారత సంస్కృతి, సాంప్రదాయ కళల ప్రోత్సాహక బోర్డు, నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ–తెలంగాణ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.

బేసిక్ లెవల్స్ 1, 2, 3, 5కు సంబంధించిన ప్రాక్టికల్, వైవా, థియరీ పరీక్షల్లో సుమారు 85 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రముఖ పేరిణి నాట్య గురువు, సూర్యాపేటకు చెందిన ఎం. శ్రీకాంత్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించగా, వరంగల్‌కు చెందిన పేరిణి నాట్య అధ్యాపకులు పల్నాటి శ్రీజ, బండారి తేజస్విని, గడ్డం విద్యాశ్రీ ఇంటర్నల్ ఎగ్జామినర్లుగా విధులు నిర్వహించారు.

చీఫ్ ఎగ్జామినర్‌గా గురుశ్రీ పేరిణి ప్రవీణ శ్రీ గజ్జెల రంజిత్ కుమార్ వ్యవహరించారు.శ్రీ సమ్మోహన నృత్యాలయం ఆచార్యులు తోట ప్రశాంత్, స్నేహ దంపతులు విద్యార్థులకు శిక్షణ అందించడంతో పాటు పరీక్షల సమయంలో నట్టువాంగం నిర్వహించి సహకరించారు. చిన్న వయసులోనే విద్యార్థులు పేరిణి నాట్యంలో శిక్షణ పొంది పరీక్షలకు హాజరుకావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యకళలకు ఈ కార్యక్రమం ప్రోత్సాహాన్ని అందించిందని నిర్వాహకులు తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD