Pitlam: మత్తు పదార్థాల విక్రయాలపై ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు
Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లంలో ప్రభుత్వ పాఠశాలల సమీపంలో డాగ్ స్క్వాడ్‌తో సోదాలు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్సై ఆంజనేయులు.
Pitlam: మత్తు పదార్థాల విక్రయాలపై ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు
పిట్లం: పిట్లం (కామారెడ్డి) కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో మంగళవారం కామారెడ్డి జిల్లా ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల సమీపంలోని పాన్ షాప్, కిరాణా దుకాణాల వద్ద డాగ్ స్క్వాడ్ సహాయంతో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.
ప్రధానంగా కిరాణ, పాన్ షాప్ నిర్వాహకులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మాదకద్రవ్యాలు , మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు గాను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పిట్లం ఎస్సే ఆంజనేయులు తెలిపారు. సమాజానికి హానికరమైన మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎవరైనా అక్రమంగా మాదకద్రవ్యాలు , మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈగల్ టీమ్ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమం లోఈగల్ టీమ్ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




