Banswada: సంగమేశ్వరం కాలనీలో అన్నదానం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎండెల!

Banswada: బాన్సువాడలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. అయ్యప్ప ఆలయంలో పూజలు, మెగా రక్తదాన శిబిరం, అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎండెల లక్ష్మీనారాయణ.

SALEEM, BANSWADA
Published on: 17 Sept 2026 10:05 PM IST
Banswada
X

Banswada: సంగమేశ్వరం కాలనీలో అన్నదానం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎండెల!

బాన్సువాడ: ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించారు.

దేశానికి మరింత సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో నరేంద్ర మోదీ జీ గారికి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బాన్సువాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగర వెసారు. నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

అనంతరం సంగమేశ్వరం కాలనీలో నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బాన్సువాడ రూరల్ అధ్యక్షులు శ్రీనివాస్,

నసుల్రాబాద్ మండల అధ్యక్షులు హనుమన్ యాదవ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బీజేపీ కౌన్సిలర్ మహేష్ బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ చీకట్ల రాజు కొండని గంగారం భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ చంద్రశేఖర్ గౌడ్ పురుషోత్తం సచిన్ మహేందర్ ప్రదీప్ శంకర్ నరేష్. సాయి రెడ్డి భూమేష్ దత్తు సాయి మణిందర్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA