Banswada: నసురుల్లాబాద్‌లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!

Banswada: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నసురుల్లాబాద్ అంగన్‌వాడీ కేంద్రంలో పండ్ల పంపిణీ.

SALEEM, BANSWADA
Published on: 17 Sept 2026 4:00 PM IST
Banswada
X

Banswada: నసురుల్లాబాద్‌లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!

Banswada: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అంగన్‌వాడీ పాఠశాల లోని చిన్న పిల్లలకు, పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు , మాట్లాడుతూ, దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రంలో పండ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ , గంగాధర్ గుప్తా,మండల ఉపాధ్యక్షులు శేఖర్,బాకా నాగరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రాందాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయిలు,బండపల్లి శ్రీను, జెల్ల సాయిలు, రవికాంత్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA