Banswada: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే!
Banswada: బాన్సువాడలో SRNK డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఉదయం, సాయంత్రం సర్వీసులు.
Banswada: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే!
Banswada: కొల్లూరు,దామరంచ, రైతునగర్,అన్నారం, చించోలి ,కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి SRNK డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్ , SRNK డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు
ఈ నెల 7వ తేదీన బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కిష్టాపూర్, బీర్కూర్ పరిసర గ్రామాలకు చెందిన SRNK డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ సమస్యను పోచారం దృష్టికి తీసుకువచ్చారు. సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలియజేయడంతో, పోచారం వెంటనే స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోచారం సూచనల మేరకు బాన్సువాడ నుంచి కొల్లూరు-దామరంచ-రైతునగర్ - అన్నారం - కిష్టాపూర్ – బిర్కూర్ తిమ్మాపూర్ – బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదుగా SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పోచారం.
ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఈరోజు బాన్సువాడ బస్టాండులో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు.
విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఉదయం మరియు సాయంత్రం రెండు వేళల్లో నడిపించాలని బాన్సువాడ డిపో మేనేజర్‌కు పోచారం సూచించారు.
తమ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయించిన పోచారం శ్రీనివాసరెడ్డి కి విద్యార్థినులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




