Jukkal: జుక్కల్లో పోలాల అమావాస్య సందడి.. బసవన్నలకు ఘన పూజలు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పోలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. బసవన్నలను అందంగా అలంకరించి పూజలు చేశారు.
Jukkal: జుక్కల్లో పోలాల అమావాస్య సందడి.. బసవన్నలకు ఘన పూజలు!
జుక్కల్ (కామారెడ్డి ): ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు సాగులో చేదోడు వాదోడుగా నిలిచే బసవన్నలతో విడదీయరాని అనుబంధం ఉంది. దుక్కి దున్నడం నుంచి పంట నూర్పిడి వరకు రైతుకు అండగా నిలిచే ఎడ్లను రైతులు దైవంగా భావిస్తారు. ఈ అనుబంధానికి ప్రతీకగా ప్రతి ఏటా శ్రావణమాసం ముగింపు రోజున నిర్వహించే పొలాల అమావాస్య వేడుకలను జుక్కల్ నియోజకవర్గంలో రైతులు ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లొని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ, బిచ్కుంద, పెద్దకొడప్గల్ మండలాల్లోనిపలుగ్రామాల్లోరైతులుసంప్రదాయబద్ధంగాపొలాలఅమావాస్యనుజరుపుకున్నారు.అమావాస్య సందర్భంగా బసవన్నలను వ్యవసాయ పనులకు తీసుకెళ్లకుండా చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానాలు చేయించారు.
ఈ నియోజకవర్గం లో పొలాల అమావాస్యకుఎంతోప్రాధాన్యత ఉంది. మహారాష్ట్రకు సరిహద్దు లో ఉండడంతో అక్కడి సంప్రదాయం ప్రకారం పండుగ నిర్వహిస్తారు. వ్యవసాయం లో సహాయపడే గోమాతలకు ఒక రోజు పండుగ చేసి పూజించడం పొలాల అమావాస్య పండుగ ప్రత్యేకమని అన్నదాతలు తెలిపారు. భాషింగలతో అలంకరణ చేసి హన్మాన్ మందిరం చుట్టూ తిప్పి లగ్న పూజలు చేసి బంధు మిత్రులకు పిండివంటలువడ్డీస్తారు.అనంతరం రకరకాల రంగులు అద్ది, గజ్జెలు, గంటల దండలతో అందంగా అలంకరించారు.
గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి, దేవుళ్లను దర్శించుకున్న తర్వాత బసవన్నలను ఇంటికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమ పెట్టి మంగళహారతులు ఇచ్చి ఉలవలు, బొబ్బర్లు, బెల్లం పాకం, పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు.
అనంతరంగ్రామముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన తోరణాన్ని గ్రామ పోలీస్ పాటిల్ చేతులమీదుగాతెంపేసంప్రదాయాన్ని నిర్వహించారు. రైతన్నలకు అన్నం పెట్టే బసవన్నలను తల్లితో సమానంగా భావిస్తూ పూజించే ఈ ప్రత్యేక సంస్కృతి జుక్కల్ ప్రాంతంలో ప్రతి ఏటా ఘనంగాకొనసాగుతుంది.




