Veldanda: నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ విద్యుత్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలో ఖాళీ వెంచర్లలోని కరెంట్ స్తంభాల వైర్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Aug 2026 10:13 PM IST
Veldanda
X

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ విద్యుత్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం ఆగస్టు 03 : గత కొంతకాలంగా ఖాళీ వెంచర్లే లక్ష్యంగా చేసుకొని వెంచర్లో వేసిన కరెంటు లైన్స్ మీద ఉన్న విద్యుత్ వైర్లను కట్ చేసి దొంగిలించిన ఇద్దరు నేరస్తులు మునావత్ దినేష్ (కొడుకు),మునావత్ మోహన్ ( తండ్రి) నివాసం కవులోనిబవి తండా మహేశ్వరం లో పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు.

రాజు, దినేష్, రమేష్ తో కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. సోమవారం ఉదయం కొట్ర చౌరస్తా దగ్గరలో అనుమానం గా ఉండటంతో పట్టుకొని విచారించగా మే నెలల్లో పెద్దాపూర్ శివారులో ఉన్న ఆర్.ఆర్. ఆర్ వెంచర్ లో దినేష్, మోహన్,దినేష్, రమేష్ హైదరాబాద్ నివాసం 5 గురు కలిసి సుమారు 60 పోల్స్ వైర్ దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు.

దాని తర్వాత జూన్ నెల మొదటి వారం లో కల్వకుర్తి ఏరియా లో బాలాజీ టౌన్ షిప్ లో సుమారు 30 స్తంభాల విద్యుత్ వైర్, తరవాత జూలై నెల 12న కొట్ర గ్రామ శివారులో ఒక వెంచర్ లో సుమారు 70 స్తంభాల కరెంటు వైర్ ని దొంగతనం 5 గురు కలిసి దొంగిలించిన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు.దొంగ తనం చేసిన వైర్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి మోహన్ తన షాప్ దగ్గరికి వచ్చి పాత సామాన్లు వేసుకునే వారికి కొంత అమ్మడం జరిగింది.

ముగ్గురిని అరెస్టు చేసి 750 కిలోల కరెంట్ వైర్, రూ.75,000/- రూపాయలు, నేరానికి ఉపయోగించిన ఒక ట్రాలీ ఆటో మరియు ఒక మహేంద్ర థార్ వెహికల్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డిలు తెలిపారు.పరారీలో ఉన్న రాజు, దినేష్, రమేష్ లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసును చాకచక్యంగా చేదించిన, సీఐ, ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ నజీర్, అంజి , నవీన్, కిషోర్ కుమార్ రెడ్డిలను కల్వకుర్తి డీఎస్పీ అభినందించడం జరిగింది.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story