Bodhan: హైదరాబాద్ టు బోధన్: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు!
Bodhan: హైదరాబాద్ మేడ్చల్ నుంచి బోధన్‌కు అక్రమంగా తరలిస్తున్న 523 బస్తాల రేషన్ బియ్యం లారీని పట్టుకున్న బోధన్ పోలీసులు. సివిల్ సప్లై అధికారులకు అప్పగింత, కేసు నమోదు.
Bodhan: హైదరాబాద్ టు బోధన్: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు!
బోధన్: హైదరాబాద్ నుండి బోధన్ వైపు అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం లారీని బోధన్ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ శుక్రవారం రాత్రి పట్టుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.
హైదరాబాదులోని మేడ్చల్ నుండి బోధన్ వైపు TS16ub3690 నెంబర్ గల లారిలో సుమారు523 బస్తాల బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో అట్టి లారీని అడ్డుకొని లారీ డ్రైవర్ విచారించాగా డ్రైవర్ వద్ద బియ్యంలోడు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సివిల్ సప్లై అధికారులకు సమాచారాన్ని అందించారు.
లారీలో తరలిస్తున్న బియ్యం పిడిఎస్ బియ్యం గా గుర్తించి నట్లు పోలీసుల పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై సివిల్ సప్లై అధికారుల పీర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు.




