Jukkal: తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరిన బొర్గి సంజీవ్

Jukkal: జుక్కల్‌కు చెందిన పోలీస్ ఉద్యమకారుడు బొర్గి సంజీవ్, తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరారు.

VEERANNA, JUKKAL
Published on: 13 May 2026 9:03 PM IST
Jukkal
X

Jukkal: తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరిన బొర్గి సంజీవ్

Jukkal: జుక్కల్ (కామారెడ్డి) తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బుధవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదని అన్నారు. ముఖ్యం గా నీళ్ళు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పాలకులు ఏ ఒక్కటి సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 12 సంవత్సరాల బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనలో పతకాల పేరుతో స్కాములు చెయ్యడం జరిగిందని కాంగ్రెస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమ కారులను, కళాకారులను, అమరవీరుల కుటుంబాలను పూర్తిగా విస్మరించాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ లో అభివృద్ధి సంక్షేమ పేరుతో దోపిడి తప్ప ఎక్కడ అభివృద్ధి జరగడంలేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కవిత గారి సారధ్యంలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలపైన నిరంతరం పోరాటం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ లను అమలయ్యే విధంగ దృష్టి సారించాలని,

లేని పక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేస్తామని దీనికి జుక్కల్ నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరు కొత్త పార్టీ లో చేరి కవితక్కా నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ లో చేరిన బొర్గి సంజీవ్ కు కల్వకుంట్ల కవిత పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story