Bodhan: ధాన్యం దళారులతో కుమ్మక్కైన ఖాకీ.. అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్
Bodhan: ఒక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ధాన్యం దళారులతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Bodhan: ధాన్యం దళారులతో కుమ్మక్కైన ఖాకీ.. అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్
Bodhan: డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ హెచ్ ఓ ధాన్యం దళారులకు మద్దగా నిలుస్తునాడని ఆరోపణలు వెళువెత్తుతున్నాయి. డివిజన్ పరిధిలో గల ఎస్ హెచ్ ఓ గా సుమారు 15నెలలకు పైగా ఒక పోలీస్ స్టేషన్ లో విధులు చేపడుతున్నాడు. ఇటీవల దళారుల పై పలు ఆరోపణలు రావడం తో ఇదే అదునుగా చేసుకున్న సదరు అధికారి అక్రమ వసూళ్లకు తీరాలిపినట్లు విమర్శలు ఉన్నాయి.
దళారులనుండి రైతులను కాపాడాల్సిన అధికారి ఏకంగా దళారులతో కుమ్మకై వారి పై వచ్చే ఆరోపణలు, పిర్యాదు లను పెదచేవిన పెట్టి వారికే మద్దతు ప్రకటించాడం దారుణం. దళారీగా అవుతారం ఎత్తిన మరో దళారీ రైతుల వద్ద నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి తన సొంత మిల్లుకు తరలి స్తు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు.
రైతులకు సమస్యలు తలెత్తి నప్పుడు వారికి అండగా ఉంటూ న్యాయం చేయాలి కానీ సదరు అదిరా దళారీనే ఏజెంట్ గా మలుచుకుని భారీగా వసూళ్లు చేస్తున్నాఅదునుగా చేసుకుని పోలీస్ స్టేషన్ లో పారిశుధ్యపనులు, మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో పాటు మొరం, ఇసుక అక్రమ రవాణా చేసే వారి వద్ద సైతం భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు లేక పోలేదు. ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించి దళారుల నుండి రైతులను కాపాడడం తో పాటు సదరు అధికారి పై విచారణ చెపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




