Kamareddy: ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
Kamareddy: మొహమ్మద్ నగర్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Kamareddy: ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
Kamareddy: మొహమ్మద్ నగర్ మండలం లోని బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీ లకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బుధవారం మొహమ్మద్ నగర్ మండల కేంద్రం లోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన షాది ముభారక్,కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చేతుల మీదుగా జరిగింది. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీ లకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే తోట, డి సి సి అధ్యక్షుడు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని, ఇలాంటి పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో తొడ్బటును అందిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




