Banswada: చందూర్‌లో పూసలతో అద్భుతంగా తీర్చిదిద్దిన గణనాథుడు!
Banswada: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం చందూర్‌లో పూసలతో అద్భుతంగా తీర్చిదిద్దిన పూసల గణపతి.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న వైనం.
Banswada: చందూర్‌లో పూసలతో అద్భుతంగా తీర్చిదిద్దిన గణనాథుడు!
Banswada: నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన పూసల గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది..యూత్ సభ్యులు పూసలను సేకరించి, సుమారు 15 రోజుల పాటు కష్టపడి పూసలతో గణనాథున్ని తీర్చిదిద్దారు.ఎంతో కళాత్మకంగా రూపుదిద్దుకున్న గణేషున్నీ దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తున్నారు .
గతంలో కూడా వీరు గవ్వల ఘన నాధుడు,నెమలి ఈకలతో తయారుచేసిన గణపతులను ప్రతిష్టించి ప్రత్యేకంగా నిలిచారు.ప్రతీ ఏటా సరికొత్త ఆలోచనల తో, ఒక కొత్తదనాన్ని రూపొందించి,భక్తులకు విశేషంగా ఆకట్టుకునే విధంగా గణ నాథులను ప్రతిష్టిస్తూ.శివాజీ గణేష్ మండలి నిర్వాహకులు ప్రజల మన్ననలు పొందుతున్నారు.




