Kamareddy: సహాయం చేసే మానవత్వం కాస్త ప్రాణం తీసింది!

Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

VEERANNA, JUKKAL
Published on: 21 May 2026 7:46 PM IST
Kamareddy
X

Kamareddy: సహాయం చేసే మానవత్వం కాస్త ప్రాణం తీసింది!

Kamareddy: తడి హిప్పర్గ (కామారెడ్డి) విద్యుత్ పనుల్లో తన వంతు సహాయంగా లైన్ మ్యాన్ కు తోడుగా ఉందామనుకున్న మానవత్వం కాస్త ప్రాణం హరించిన ఘటన ఒకటి మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామంలో చోటు చేసుకుంది. మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామానికి చెందిన కూర్మ నాగు రావు (50) అనే వ్యక్తి కి విద్యుత్ పనులు రావడంతో గ్రామంలో లైన్ మ్యాన్ గా విధులు నిర్వహించే మహేష్ కు ప్రైవేట్ సహాయకుడిగా ఉంటూ గ్రామంలోని విద్యుత్ స్తంభాలు ఎక్కడం దిగడం చిన్న చిన్న విద్యుత్ పనులు ఏవైనా ఉంటే వెళ్లి చూస్తూ మరమ్మత్తు చెయ్యడం లాంటివి చేసేవాడు. అదే రీతిగా గురువారం ఉదయం గ్రామం లోని గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉదయం నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తున్న క్రమంలో స్తంభం పై ఉన్న 11 కె వి విద్యుత్ లైన్ కు తన కుడి చేతి కి తాకడం వల్ల నాగు రావు కు షాట్ సర్క్యూట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడు. మృతుడి కుమారుడు బూరే దత్తు పిర్యాదు మేరకు మద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story