Bodhan: బోధన్‌లో ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ మాఫియా.. కోట్ల రూపాయల దందా!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంతో పాటు మండలాల్లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నాయి.
Bodhan: బోధన్‌లో ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ మాఫియా.. కోట్ల రూపాయల దందా!
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం తో పాటు వివిధ మండలల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలకు ప్రతి యేడు విద్యా సంవత్సరం వచ్చిందంటే చాలు కోట్ల రూపాయల వ్యాపారం సమాకురుస్తుంది. పేద ప్రజల అవసరల ను ఆసరాగా చేసుకుని ప్రైవేటు పాఠశాల ల్లో ఉన్నత విద్యా కోసం పాఠశాల్లో చేర్పిస్తున్నారు. ప్రతి యేడు మాదిరిగా ఈ విద్యసంవత్సరానికి పుస్తకా వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.
పేద ల నడ్డి విరుస్తూ ఆయా యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధం గా పుస్తకాల వ్యాపారం కు తెరలేపి కోట్లు గడిస్తున్నట్లు ఆరోపణలు వెళువెత్తుతున్నాయి. బోధన్ ప్రయివేట్ రెసిడెన్సీ యల్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలసిల్లాయ్. ముఖ్యం గా పేరుగాంచిన విద్యాసంస్థల తో పాటు మరికొన్ని పాఠశాలల్లో పుస్తక వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. నిబంధనలు విరుద్ధంగా పుస్తకాలను తమ వద్దనే కొనుగోలు చేయాలని ఉక్కుములు జారీ చేస్తూ వ్యాపారంను కొనసాగిస్తున్నారు.
ఎల్ కేజీ నుండి మొదలు 5వతరగతి వరకు ఒక్కో క్లాస్ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రతి పాఠశాలలో ఫీజు వివరాలు నోటీసు బోర్డులో అతికించి ఉండాలి. పాఠశాల ఫీజులోని యూనిఫామ్, బుక్స్ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. యూనిఫామ్ బుక్సులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తూ భారీగానే దండుకుంటున్న విమర్శలు గుప్పుమంటున్నాయి. సంబంధిత విద్యాశాఖ అధికారుల అండదండలతో పుస్తక వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు భారీగా విమర్శలు తలెత్తుతున్నాయి.
పాఠశాలల సమీపంలోని ప్రత్యేక బుక్ కౌంటర్లను ఏర్పాటు చేసి పాఠ్య పుస్తకాలను తల్లిదండ్రులకు బలవంతంగా పుస్తకాలను అంటగడుతున్నారని విమర్శలు కుప్పిస్తున్నారు. ఈ విషయమై బోధన్ మండల విద్యాధికారి నాగయ్యను వివరణ కోరగా ప్రవేట్ పాఠశాలలో పార్టీ పుస్తకాలు విక్రయించుకోవచ్చని సమాధానం ఇవ్వడం కోసమేరుపు. అక్రమార్కులకు అండగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారి మాటలు మరింత ఊతమిస్తున్నాయి.




