Nizamabad: ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ నివాళులు!
Nizamabad: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.
Nizamabad: ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ నివాళులు!
Nizamabad: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్నీ తానై ముందుండి స్వరాష్ట్రం కలను సాకారం చేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆ మహనీయుడి జయంతి వేడుకలను ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు.
అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.అదేవిధంగా ఉద్యమ స్వరం గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉద్యమకాలంలో ఆయన రాసిన పాటలు గజ్జి కట్టి ఆడిన ఆటలు ఉద్యమానికి ఊపిరి పోసాయని కొనియాడారు. అలాంటి మహనీయులను స్నరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జయశంకర్ సార్ కలలు గన్న తెలంగాణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆ మహనీయుడి మేధస్సుతో స్వరాష్ట్రం కల సాకారం అయ్యిందన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, డిచ్ పల్లి సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్, ధర్పల్లి పార్టీ మండల అధ్యక్షుడు నరేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




