Jukkal: ప్రోటోకాల్ గాలికి.. సర్పంచ్‌ను విస్మరించి చెక్కు పంపిణీ చేసిన నాయకులు!

Jukkal: కామారెడ్డి జిల్లా లాడేగావ్ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ వివాదాస్పదమైంది.

VEERANNA, JUKKAL
Published on: 20 Jun 2026 1:26 PM IST
Jukkal
X

Jukkal: ప్రోటోకాల్ గాలికి.. సర్పంచ్‌ను విస్మరించి చెక్కు పంపిణీ చేసిన నాయకులు!

లాడే గావ్ (కామారెడ్డి): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు అండగ ఉండేందుకు గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం లో కొందరు పలుకుబడి గల రాజకీయ నాయకుల అండదండలతో గ్రామాల్లో ప్రోటోకాల్ ను ఉల్లంఘించి చెక్కులను పంపిణి చేస్తున్న వైనం జుక్కల్ మండలం లో నెలకొంది.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లాడే గావ్ గ్రామంలో ఓ లబ్ధిదారుడికి మంజూరైన సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును గ్రామ ప్రజలచే ఎన్నుకోబడిన గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ కు ఎలాంటి సమచారం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించి లబ్ధిదారునికి చెక్కు అందజేయడం వ్యవహారం కాస్త వివాదాస్పదంగా మారింది.

గ్రామానికి సంబంధించిన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం , ప్రోటోకాల్ పాటించడం లాంటిది సాధారణ ప్రక్రియ కాగా ఈ కార్యక్రమం లో అలాంటి విధానాలేవీ పాటించలేదని విమర్శలు విన్పిస్తున్నాయి.

గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ ను పక్కన పెట్టీ చెక్కు పంపిణీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన పై సంబంధిత స్థాయి అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story