Kamareddy: బిచ్కుంద ‘రిపల్స్’ స్కూల్ సీజ్.. మున్సిపల్ కమిషనర్ సంచలన ప్రకటన!

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని 'రిపల్స్ లెర్నింగ్ క్యాంపస్' పాఠశాలపై మున్సిపల్ కమిషనర్ హాయుం తీవ్ర చర్యలకు ఆదేశించారు.

VEERANNA, JUKKAL
Published on: 19 Jun 2026 10:25 AM IST
Kamareddy
X

Kamareddy: బిచ్కుంద ‘రిపల్స్’ స్కూల్ సీజ్.. మున్సిపల్ కమిషనర్ సంచలన ప్రకటన!

కామారెడ్డి: బిచ్కుంద (కామారెడ్డి) నిర్మాణ అనుమతులు లేకుండా నడిపిస్తున్న రిపల్స్ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ హాయుo తెలిపారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల నడుపుట కొరకు మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతులను యాజమాన్యం తీసుకోలేదని స్పష్టం చేశారు. యాజమాన్యానికి ఇచ్చిన గడువు సైతం ముగిసిందని త్వరలో పాఠశాలను సీజ్ చేయనున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు దృశ్య తల్లిదండ్రులు తమ పిల్లలను కామారెడ్డి జిల్లా బిచ్కుండలోని రిప్పాల్స్ పాఠశాలలో చెరిపించవద్దని మున్సిపల్ కమిషనర్ సూచించారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కందర్ పల్లి లో కొనసాగుతున్న రిప్పాల్స్ లెర్నింగ్ క్యాంపస్ పాఠశాలపై వస్తున్న ఆరోపణలతో పాఠశాల నిర్వహణ సందిగ్ధంలో పడిపోయింది.

ఇప్పటి వరకు పాఠశాలకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ విద్యార్థుల తల్లి తండ్రులను మాయమాటలతో కాలం వెల్లదీసిన యాజమాన్యానికి మున్సిపల్, విద్యాశాఖ, సబ్ రిజిస్టర్ ల నుండి ఉన్నట్టుండి ఒక్కసారిగా నోటీసులు రావడంతో పాఠశాల నిర్వహణ ప్రశ్నార్థకం అయ్యింది. పాఠశాలపై రోజుకో ఆరోపణ వస్తుండడంతో పాఠశాల నుండి విద్యార్థులు ఒక్కొకరుగా వేరే పాఠశాలకు మారిపోతున్నారు.

పాఠశాల నిర్వహణపై మండల విద్య శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, సబ్ రిజిస్టర్ హరి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ హాయుo లను సంప్రదించి వివరణ కోరగా తప్పుడు లీజు డాక్యుమెంట్లు, లే అవుట్ పర్మిషన్, నిర్మాణ అనుమతులు తదితర నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కి కాలం వెళ్లదీస్తున్నారని తెలిసిందని సదరు అధికారులు తెలిపారు.

రిప్పాల్స్ పాఠశాలపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడం జరిగిందని అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులు చేరకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఎక్కడ తమ విద్య సంస్థ మూత పడుతుందోనని విద్య సంస్థ కరస్పాండెంట్ ఎలాగైనా చేసి డాక్యుమెంట్ల సమర్పించేందుకు గాను ఇంకొంత సమయం కావాలంటూ పలుకుబడి ఉన్న నాయకుల సహకారం తో అధికారులకు 90 రోజుల గడువును తీసుకొని సోషల్ మీడియా లో తన వాయిస్ ను వైరల్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వార సమాచారం.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story