Nandipet: మన ఊరు - మన భద్రత.. హెల్మెట్‌పై యువతకు అవగాహన
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది.
Nandipet: మన ఊరు - మన భద్రత.. హెల్మెట్‌పై యువతకు అవగాహన
Nandipet: జిల్లా సీపీ ఆదేశాల మేరకు మన ఊరు మన బాధ్యత మన భద్రత కార్యక్రమం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో నందిపేట్ SI శామ్ రాజ్ , గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యం లో యువతకు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. Si శామ్ రాజ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని అన్నారు.
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కావున ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ తో పాటు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం చిట్టరిచ్చ నేరమని అన్నారు.
కావున ప్రతి ఒక్కరు ఇప్పటికైనా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని అన్నారు. అనంతరం సర్పంచ్ మీసాల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేని క్రమ యువకుల కోసం తను ముందుండి లైసెన్స్ లను ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ నవీన్ మరియు గ్రామ యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.




