Sirikonda: నారాయణపూర్‌లో గిరిజన పండుగ 'బ్యాక్ టు అవర్ ట్రైబల్ రూట్స్'!
Sirikonda: సిరికొండ మండలం నారాయణపూర్‌లో ఆర్పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో 'బ్యాక్ టు అవర్ ట్రైబల్ రూట్స్' గిరిజన పండుగ మరియు అవగాహన సదస్సు.
Sirikonda: నారాయణపూర్‌లో గిరిజన పండుగ 'బ్యాక్ టు అవర్ ట్రైబల్ రూట్స్'!
Sirikonda: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామంలో ఆర్పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో 'బ్యాక్ టు అవర్ ట్రైబల్ రూట్స్' గిరిజన పండుగ, అవగాహన సదస్సు జరగనుంది. సంప్రదాయ ఆహారం, దేశవాళీ విత్తనాల పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సంప్రదాయ వంటకాల ప్రదర్శన, బయో రిసోర్స్ కేంద్రం ప్రారంభోత్సవం, మొక్కల పంపిణీ, క్షేత్రస్థాయి పరిశీలన వంటివి చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఎ పీఓ మంద మకరందులతో పాటు సుమారు 40 గ్రామాల గిరిజన పటేళ్లు హాజరవుతున్నట్లు RPG ఫౌండేషన్ ఆపరేషనల్ మేనేజర్ గంతుల్వర్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో 300 నుంచి 500 మంది గిరిజన రైతులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.




