Bodhan: రుద్రూర్‌లో దళారుల ఆగడాలు.. సాగుబాటలో బోరు బావి!
Bodhan: రుద్రూర్ మండలంలోని మల్లయ్య గుట్ట, నక్కల ఒర్రె ప్రాంతాల్లో పంట కాలువలు, సాగుబాటలు కబ్జాకు గురయ్యాయని రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
Bodhan: రుద్రూర్‌లో దళారుల ఆగడాలు.. సాగుబాటలో బోరు బావి!
Bodhan: రుద్రూర్ మండల కేంద్రంలో గల శివారులోని రోడ్లు, పంట కాలువల కబ్జాలపై బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రుద్రూర్ చెందిన పలు రైతులు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జవహర్ నగర్ కాలనీ నుండి మల్లయ్య గుట్టకు వెళ్లే దారి కబ్జా చేసి ఓ దళారి పై బోరు వేయడంతో రైతులకు తీరు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మల్లయ్య గొట్టం వెళ్లి రైతులకు వడ్ల సీజన్లో తిప్పలు తప్పడం లేదని పలు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతోపాటు నక్కల ఒర్రె, మల్లయ్య గుట్ట ప్రాంతాల్లోని వంటకాలువలు కబ్జా చేయడంతో నిజాంసాగర్ నుండి వచ్చే సాగునీరుకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ప్రజలను ఫిర్యాదు చేశారు. సుమారు 30 ఫీట్ల వెడల్పు గల పంట కాలువలను, రోడ్లను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సాగునీటికి రవాణా సౌకర్యానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైతులు విన్నవించారు. పంట పొలాల్లో కి వెళ్లే దారిలో బోరు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్న సదర్ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.




