Rudrur: రుద్రూర్ మండలంలో ఒకే ఒక్క ఏఈఓ పెరిగిన పనిభారంతో రైతుల అవస్థలు

Rudrur: రుద్రూర్ మండలంలో అధికారుల కొరతతో వ్యవసాయ పథకాల అమలులో జాప్యం. 8750 ఎకరాలకు ఒకే విస్తరణ అధికారి ఉండటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు.

K RAVI, BODHAN
Published on: 2 July 2026 5:50 PM IST
Rudrur
X

Rudrur: రుద్రూర్ మండలంలో ఒకే ఒక్క ఏఈఓ పెరిగిన పనిభారంతో రైతుల అవస్థలు

రుద్రూర్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో గల రుదురు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు సరిపడ లేకపోవడంతో పని భారం అధికమవుతుంది. రుద్రూర్ మండల కేంద్రంలో సుమారు ముగ్గురు విస్తీర్ణ అధికారులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారి తో పాటు వి స్తీర్ణ అధికారి ఒక్కరే పని చేస్తున్నారు.

ఒక క్లస్టర్ లో 5వేల ఎకరాలు ఉండాలి. రుద్రూర్ మండలం లో 8750 ఎకరాల విస్తీర్ణం అధికంగా ఉండడం తో 2018నుండి వరకు ఇద్దరు విస్తీర్ణ అధికారులు గా పని చేశారు. ప్రస్తుతం ఒక్కరే విస్తీర్ణ అధికారి ఉండడడం తో భూమి విస్తీర్ణం అధికామవ్వడం తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో జాప్యం అవుతుంది.

గతంలో లో కంటే ప్రస్తుతం పనిభారం పెరగడం తో పాటు యాఫ్ లు, వరి కొనుగోళ్ళ సమయం లో ఇబ్బందులు తప్పడం లేదు దింతో రైతుల కు అనేక అవస్థలు ఎదురైఔతున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలో మాదిరి ఇద్దరు అధికారులను నియమించి రెండు క్లస్టర్ల లో రైతుల సౌలభ్యం కోసం ఇద్దరు విస్తీర్ణ అధికారులను నియమించాలాని రుద్రూర్ మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story