Rudrur: రుద్రూర్‌లో 5వ రోజుకు చేరిన వీఓఏల సమ్మె!

Rudrur: రుద్రూర్ మండల కేంద్రంలో ఐదవ రోజుకు చేరిన ఐకేపీ వీఓఏ (IKP VOA) ఉద్యోగుల సమ్మె.

K RAVI, BODHAN
Published on: 29 May 2026 4:33 PM IST
Rudrur
X

Rudrur: రుద్రూర్‌లో 5వ రోజుకు చేరిన వీఓఏల సమ్మె!

రుద్రూర్: మండల కేంద్రంలో తనమా న్యాయమైన డిమాండ్ల కోసం సంయబాట పట్టిన ఐకెపి వివో ఏ ఉద్యోగుల సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో పాల్గొన్న వివోఏలకు మద్దతుగా ఋతువులు మండల బీహార్ ఎస్ నాయకులు రవికిరణ్ సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. దీక్ష చేపడుతున్న వివో ఏ లకు మజ్జిగను పంపిణీ చేసి సానుభూతి ప్రకటించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి లేక అమాయకులను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. ఐకెపిలో పనిచేస్తున్న వివోఏలకు తక్షణమే 26 వేల గౌరవ వేతనం అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. వారి కుటుంబ భద్రత కోసం భీమా సౌకర్యం కల్పించి అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు.

లేనిపక్షనా బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ఢిల్లీ పర్యటనకు పరిమితం అవుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని ఆరాధ కోల్పోయారని విమర్శించారు. ఈ దీక్షలో వివోఏ సంఘం అధ్యక్షురాలు జేరిన, కార్యదర్శి స్వరూప, జ్యోతి, కరుణ,కమల తో పాటు దీక్షలో పాల్గొన్న వారికి బి ఆర్ ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story