Rudrur: జోదరులను అరెస్ట్ చేసిన రుద్రూర్ పోలీసులు
Rudrur: రుద్రూర్ మండలంలో పేకాట స్థావరంపై ఎస్సై ఎల్. రామ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రూ. 6,620 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Rudrur: జోదరులను అరెస్ట్ చేసిన రుద్రూర్ పోలీసులు
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రం బొప్పాపూర్ రోడ్డులో గల ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు, ఆదివారం అర్థరాత్రి రుద్రూర్ పోలీసులు పేకాట స్థావరం పై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 6,620 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్.రామ్ తెలిపారు.
ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడినట్లు తెలిస్తే,తమకు సమాచారం అందించాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై రామ్ తెలిపారు. పేకాట ఆడితే ఎంతటి వారైనా వదిలి పెట్టబోమని,కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.




