Rudrur: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

Rudrur: రుద్రూర్ పోలీసులు వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

SALEEM, BANSWADA
Published on: 10 Oct 2026 7:08 PM IST
Rudrur
X

Rudrur: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

రుద్రుర్: రుద్రూర్ పోలీసులు మన ఊరు.. మన బాధ్యత.. మన భద్రత కార్యక్రమంలో భాగంగా శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో వాహనదారులకు, ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. మానవ శరీరంలో అన్నిటికంటే తల భాగం చాలా సున్నితమైందని,దాన్ని రక్షించాలని,తెలిపారు.

ద్విచక్ర వాహనదారులు రోడ్డు పై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు.శరీర భాగాల్లో అన్నిటికన్నా తల భాగమే ముఖ్యం అంటున్నారు.

అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని,అపరిచితులు ఎవరైనా సదేహాత్మకంగా కనిపిస్తే తమకు తెలియ జేయాలని,ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వాహనదారులు,ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA