Bodhan: రుద్రూర్‌లో దారుణం ఆర్టీసీ బస్టాండ్ స్థలం కబ్జా కమర్షియల్ దందా
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రుద్రూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు.
Bodhan: రుద్రూర్‌లో దారుణం ఆర్టీసీ బస్టాండ్ స్థలం కబ్జా కమర్షియల్ దందా
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రుద్రూర్ మండల కేంద్రంలో ఆర్టిసి స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రుద్రూర్ బస్టాండ్ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడి కమర్షియల్ దందాకు తెరలేపినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆర్టీసీ స్థలాన్ని కబ్జా చేసుకుని కొన్ని వ్యాపార వర్గాలకు అద్దెకిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసి టెండర్ విధానంలో మడిగెలను దక్కించుకొనల్సి ఉంటుంది.
కానీ ఓ వ్యక్తి కోర్టు వివాదంలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని యదేచ్చగా కబ్జా చేసుకొని అద్దెలకిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కోర్టు వివాదాల్లో ఉన్న ఏ స్థలంలోనైనా ఇరువర్గాలు ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించ కూడదని నిబంధనలు ఉన్నాయి. కోర్టు నిబంధనలు ఉల్లంఘించి తన సొంత కార్యకలాపాలను కబ్జా చేసిన ఆర్టీసీ స్థలంలో కొనసాగించుకోవడం గమనార్వం. ఆర్టీసీ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను బస్టాండ్లను కబ్జా చేసుకుంటున్నట్లు స్పష్టమౌతోంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి కబ్జాకు గురైన ఆర్టీసీ స్థలాన్ని స్వాధీనపరుచుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.




