Nizamabad: నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో 76వ గణేష్ ఉత్సవాలు వైభవం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో వైభవంగా 76వ గణేష్ ఉత్సవాలు.. 1950 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం, ప్రత్యేక జాతర విశేషాలు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో 76వ గణేష్ ఉత్సవాలు వైభవం!
Nizamabad: రుద్రూర్ మండల కేంద్రంలో 76 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 1950లో సార్వజనిక్ గణేశ్ మండలిని ఏర్పాటు చేసి, స్థానిక విఠలేశ్వరస్వామి ఆలయంలో తొలి గణనా థుడిని ప్రతిష్ఠించారు. నాటి నుంచి నేటి వరకు వైభవంగా ఉత్సవాలు కొన సాగుతున్నాయి.
గతేడాది 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణలో కమిటీ అధ్య క్షుడు చిదుర వీరేశం, కార్యదర్శి గెంటిల సాయిలుతోపాటు సభ్యుల కృషి విశేషంగా ఉంది. పొదుపు చేసిన విరాళాలు, ఎం డోమెంట్ నిధులతో విఠలేశ్వర ఆలయాన్ని నిర్మించి, పక్కనే గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేశారు.
రుద్రూర్ లో గణేశ్ ఉత్సవాలకు చివరి రోజు పెద్ద జాతర కూడా జరుగుతుంది.ఈ జాతర ను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడ నిర్వహించే వినాయక నిమజ్జన ఉత్సవాలకు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.




