Rudrur: రుద్రూర్‌లో అన్నపూర్ణాదేవిగా దుర్గామాత.. పూర్వ విద్యార్థుల అన్నదానం
Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ దుర్గామాత మండపం వద్ద అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వగా, ZPHS 1993-94 పూర్వ విద్యార్థులు అన్నదానం నిర్వహించారు.
Rudrur: రుద్రూర్‌లో అన్నపూర్ణాదేవిగా దుర్గామాత.. పూర్వ విద్యార్థుల అన్నదానం
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలోని దుర్గాదేవి మండపం వద్ద తొమ్మిది రోజులపాటు అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. మూడవరోజు మంగళవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా రుద్రూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థులు (1993-1994) 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పద్మ సాయినాథ్, కంచర్ల గగన్,చిలుక నర్సింలు, పార్వతి శేఖర్, కోటగిరి మురళి, వంజరి బాలాజీ, గుర్ల గోపి, ఎంబరి ఉమారాణి, బండారు కవిత, మంత్రి లక్ష్మణ్, గొల్ల శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, దుర్గామాత మాలధారణ స్వాములు, దుర్గామాత కమిటీ నిర్వాహకులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.గ్రామస్తులు వారందరికీ అభినందించారు.




