Nizamabad: తగ్గెల్లిలో ఇసుక మాఫియా బరితెగింపు.. రెవెన్యూ, పోలీసులపై దాడి యత్నం!
Nizamabad: సాలూర మండలం తగ్గెల్లిలో ఇసుక మాఫియా బరితెగించింది. అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ, పోలీసులపై దాడికి యత్నించి, కానిస్టేబుల్ బైక్ తాళాలు లాక్కుని హల్‌చల్ చేశారు.
Nizamabad: తగ్గెల్లిలో ఇసుక మాఫియా బరితెగింపు.. రెవెన్యూ, పోలీసులపై దాడి యత్నం!
Nizamabad: సాలూర మండలంలో అక్రమ ఇసుక మాఫియా ఆగడాలు తీవ్ర రూపం దాల్చాయి. అక్రమ రవాణాను అడ్డుకోబోయిన రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగడమే కాకుండా, అధికారులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన శనివారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. తగ్గెల్లి వద్ద మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో సాలూర రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఇసుకను నింపుతున్న ఒక ట్రాక్టర్ డోజార్‌తో పాటు, దానిని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తరలించకుండా సుమారు 20 మందికి పైగా ఉన్న ఇసుక మాఫియా సభ్యులు రెవెన్యూ సిబ్బందిని చుట్టుముట్టి తీవ్రం ఇబ్బందులు కు గురి చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఆర్‌ఐ శంకర్ సమాచారంతో అక్కడికి చేరుకున్న ఇద్దరు నైట్ పెట్రోలింగ్ కానిస్టేబుళ్లను సైతం మాఫియా లెక్కచేయలేదు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ, పోలీస్ ద్విచక్ర వాహనం తాళాలను బలవంతంగా లాక్కుని, వారిని పక్కకు తోసివేశారు. ఆర్‌ఐ స్వాధీనం చేసుకున్న డోజర్, బోలెరొ వాహన్ని అక్కడి నుంచి ట్రాక్టర్ ను సమీపంలోని పంట చేలోకి దౌర్జన్యంగా తరలించుకుపోయారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు కాలుకు గాయాలయ్యాయి.
కేసుల హెచ్చరికతో దారికి వచ్చి.. మళ్లీ రచ్చ !
సిబ్బందిపై దాడితో ఆగ్రహించిన రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో, సుమారు అర గంట తీవ్ర ఉద్రిక్తతల అనంతరం డోజర్‌ను తిరిగి తీసుకువచ్చారు. అనంతరం వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి ఉండగా, తహసీల్దార్ కార్యాలయం వద్దే ఉంచాలంటూ మాఫియా సభ్యులు మళ్లీ అడ్డుపడి ఒత్తిడి తెచ్చారు. రెవెన్యూ శాఖ లో ని కొందరి వైఖరిపై తీవ్ర అనుమానాలు
క గత నెల 14న ట్రాక్టర్ డోలీజార్‌ను ఆర్‌ఐ తగ్గెల్లి శివారులో ని మంజీరా వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నింపుతుండగా పట్టుకున్నారు. పట్టుకున్న వాహనాన్ని ఇప్పటి వరకు తహసీల్దార్, పోలీస్ కార్యాలయాలకు తరలించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ వాహనాన్ని వదిలి వేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిందిస్థాయి అధికారులు ప్రాణాలకు తెగించి అక్రమ ఇసుక వాహనాలను పట్టుకుంటే కొందరు నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టి వదిలివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.




