Armoor: ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరే లక్ష్యం
Armoor: గాదేపల్లి గ్రామంలో సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 'హర్ ఘర్ జల్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Armoor: ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరే లక్ష్యం
Armoor: జిల్లా కేంద్ర గాదేపల్లి గ్రామ సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో 'హర్ ఘర్ జల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మిషన్ భగీరథ ట్యాంక్‌ను సందర్శించి సరఫరా అవుతున్న మంచినీటి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందుతుందా లేదా అని స్వయంగా తెలుసుకున్నారు. గ్రామస్తుల సమక్షంలోనే నీటిని టెస్ట్ చేసి సురక్షితమైన తాగునీరు సరఫరా అవుతున్నట్లు నిరూపించి చూపించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రమోద్ గారు, ఉప సర్పంచ్ సందీప్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిన్నారెడ్డి మాట్లాడుతూ, "ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని అందించడమే గ్రామ పంచాయతీ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మిషన్ భగీరథ ద్వారా నాణ్యమైన నీటిని అందిస్తున్నాం" అని గ్రామ ప్రజలకు తెలియజేశారు.




