Jukkal: జుక్కల్ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖపై సర్పంచుల ఆగ్రహం!
Jukkal: జుక్కల్ మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై సర్పంచుల ఆగ్రహం. కరెంట్ కోతలు, మిషన్ భగీరథ నీటి ఎద్దడి, పనులకు ఎమ్మెల్యే అనుమతి నిబంధనపై నిలదీత.
Jukkal: జుక్కల్ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖపై సర్పంచుల ఆగ్రహం!
కామారెడ్డి జిల్లా, జుక్కల్: జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం అధికారుల నిర్లక్ష్యంపై సర్పంచుల ఆగ్రహావేశాలకు వేదికైంది.
సమావేశానికి మండలంలోని సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు హాజరైనప్పటికీ, హాజరు కావాల్సిన డివిజన్, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరుకావడంపై సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
డోన్‌గావ్ గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్ తండాలో నెలలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మిషన్ భగీరథ అధికారులు స్పందించడం లేదని సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
విద్యుత్ శాఖ పనితీరుపై కూడా సర్పంచులు మండిపడ్డారు. స్థానికంగా విద్యుత్ సిబ్బంది అందుబాటులోలేకపోవడంతో రాత్రివేళల్లో విద్యుత్ అంతరాయాలు, త్రీ-ఫేజ్ సరఫరా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ స్థంభాల కోసం డీడీలు చెల్లించినా ఇప్పటికీ స్థంభాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
పంచాయతీరాజ్ డీఈ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి అని చెప్పడంపై సర్పంచులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాల్సిన అధికారులు రాజకీయ పలుకుబడికి లోబడుతున్నారా అని ప్రశ్నించారు.జుక్కల్ మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న స్థానికఅధికారులపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు స్పందించి తాగు చర్యలు తీసుకోవాలని సర్పంచులు సమావేశంలో డిమాండ్ చేశారు.




