Jukkal: దళిత, గిరిజన జర్నలిస్టుల ముందస్తు అరెస్టులపై అసోసియేషన్ ఆగ్రహం

Jukkal: హైదరాబాద్‌లోని ఐపీఆర్ కార్యాలయ ముట్టడికి వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడుఖండించారు

VEERANNA, JUKKAL
Published on: 29 Jun 2026 11:06 AM IST
Jukkal
X

Jukkal: దళిత, గిరిజన జర్నలిస్టుల ముందస్తు అరెస్టులపై అసోసియేషన్ ఆగ్రహం

జుక్కల్ (కామారెడ్డి): తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ఐ అండ్ పి ఆర్ కార్యాలయ ముట్టడికి వెళ్తున్న ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు లను అరెస్ట్ చెయ్యడం ప్రజా స్వామ్య విరుద్ధమని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య అన్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రాష్ట్ర సమాచార & పౌర సంబంధాల శాఖ,(I&PR) కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం శాంతి యుతంగా వెళ్తున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు, సభ్యులను ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య పేర్కొన్నారు.

దళిత, గిరిజన జర్నలిస్టులకు ఆక్రిడేషన్ కార్డులు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, గృహ సౌకర్యం వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న శాంతి యుత నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేసిన జర్నలిస్టులందర్ని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చెయ్యకుండా , తమ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు ల న్యాయమైన డిమాండ్ల పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story