Nizamabad: అలుగు పోస్తున్న సిర్నపల్లి జానకి బాయి చెరువు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలోని ఇందూరు నయగరగా పేరుగాంచిన శీలం జానకి బాయి చెరువు అలుగు పోస్తోంది.
Nizamabad: అలుగు పోస్తున్న సిర్నపల్లి జానకి బాయి చెరువు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లి లోని ఇందూరు నయగర జలపాతంగా పేరుపొందిన శీలం జానకి బాయి చెరువు అలుగు పోస్తుంది...ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సిర్నపల్లి లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి ఆలుగు పొంగిపొర్లుతోంది.
జల పాతాన్ని తలపించేలా 40 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుండటంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. చెరువు అలుగు పోయడం తెలుసుకున్న ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తున్నారు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.. తాత్కాలికంగా అయిన రోడ్డును మరమ్మతులు చేసి పర్యాటక క్షేత్రంగా సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
Next Story




