Kamareddy: పీఎం రాహత్ ను సద్వినియోగం చేసుకోవాలి..ఎస్సై!
Kamareddy: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నసురుల్లాబాద్ ఎస్సై సాయి కృష్ణ సూచించారు.
Kamareddy: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత చికిత్స.. సద్వినియోగం చేసుకోండి!
Kamareddy: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ పోలీసు ఎస్సై సాయి కృష్ణ పీ ఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స – PM-RAHAT పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం PM-RAHAT పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా ₹1.5 లక్షల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది, పథకం నిబంధనలకు లోబడి.
తెలంగాణ రాష్ట్రంలో PM-RAHAT కింద 469 ఆసుపత్రులు నమోదు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ దవాఖానలు కలవు.
పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు
1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య చికిత్స- గరిష్టంగా 7 రోజుల వరకు చికిత్స, పథకం నిబంధనలకు లోబడి, ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం, చికిత్స ఖర్చుల భయంతో వైద్య సహాయం ఆలస్యం చేయకుండా ఉండేందుకు ఉపయోగకరమైన పథకం.
ప్రజలకు విజ్ఞప్తి:
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను వెంటనే సమీపంలోని అర్హత కలిగిన ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందేలా చూడండి. అత్యవసర సహాయం కోసం 112నంబర్‌కు కాల్ చేయండి. ఈ పథకం గురించి ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి, అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారూ.
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి అక్కడ ఉన్న సిబ్బంది కి PM-RAHAT పథకం కింద అడ్మిషన్ చేయమని కోరాలి అని తెలిపారు.




