Bodhan: సిద్ధాపూర్‌లో పంచాయతీ ట్రాక్టర్‌తో ఇసుక అక్రమ రవాణా కలకలం!
Bodhan: బోధన్ మండలం సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Bodhan: సిద్ధాపూర్‌లో పంచాయతీ ట్రాక్టర్‌తో ఇసుక అక్రమ రవాణా కలకలం!
బోధన్: బోధన్ మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అందుకు తాజా ఉదాహరణ గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను ఎలాంటి అనుమతులు లేకుండా మంగళవారం ఇసుక తరలింపు పంపడంలో పలు ఆరోపణ వెలువెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను గ్రామంలో చెత్త సేకరించేందుకు, నీటి ట్యాంకు వినియోగానికి ట్రాక్టర్ ను వినియోగించాలి.
నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ ను ఓ ప్రజా ప్రతినిధి భర్త ఇసుక అక్రమ రవాణాకు వినియోగించడంతో గ్రామస్తులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
గ్రామపంచాయతీ పనులకు వినియోగించాల్సిన ట్రాక్టర్ ను బోధన్ మండలం ,ఖండ్ గావ్ లో ఇసుక రవాణాకు పంపించడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించగా గ్రామపంచాయతీ నిర్మాణం కోసం ఇసుకను తెస్తున్నట్లు సదరు ప్రజాప్రతిని భర్త సమాధానం ఇవ్వడం చర్చకు తావిచ్చింది.
వాస్తవానికి సిద్ధాపూర్ గ్రామంలో నూతన పంచాయతీ భావన నిర్మాణం కోసం అధికారులు టెండర్లు వేసి పంచాయతీ భవనం నిర్మాణం కోసం కాంట్రాక్టర్ ను ఎంపిక చేశారు.
పంచాయతీ భవన నిర్మాణం కోసం సదర్ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి డీడీలు చెల్లించి ఇసుకను నిర్మాణం కోసం తరలించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రజా ప్రతినిధి భర్త ఏకంగా తన సొంత ట్రాక్టర్ లాగా వ్యవహరిస్తూ పంచాయతి ట్రాక్టర్ ను వారి స్వ ప్రయోజనాలా కోసం వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పంచాయతీ సొంత పనుల కోసం వినియోగిస్తున్న వినియోగిస్తున్న సదరు ప్రజాప్రతినిధి భర్త పాలకవర్గానికి సైతం సమాచారం ఇవ్వకుండా అనునిత్యం పంచాయతీ ట్రాక్టర్ ను వినియోగిస్తున్నట్లు పలువురు విమర్శలు గుప్పించారు.
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ప్రణవ్ ను వివరణ కోరెందుకు ఫోన్లో సంప్రదించగా తాను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నానని సమాధానం ఇస్తూ ఫోన్ ను కట్ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.




