Bichkunda: బిచ్కుందలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే తోట
Bichkunda: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 16,564 అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.
Bichkunda: బిచ్కుందలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే తోట
బిచ్కుంద (కామారెడ్డి ): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద పట్టణంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
నియోజకవర్గంలో మొత్తం 16,564 అర్హులైన పేదకుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యేతోటతెలిపారు.అర్హులైనప్రతిపేదకుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా చేరాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం గడిచిన గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నిరీక్షణకు ముగింపు పలుకుతూ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు.
ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు కొనసాగుతాయని భరోసాఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, బిచ్కుంద మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగనాథ్, సర్పంచ్ గోపాల్ రెడ్డి, తూకరం, మునిసిపల్ కౌన్సిలర్ సందని, మరోతి, కో ఆప్షన్ సభ్యులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




