Nizamabad: కన్న తండ్రిని చంపిన కొడుకు.. మద్యం మత్తులో ఘాతుకం
Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మాన్సింగ్ తండాలో దారుణం. మద్యం మత్తులో తండ్రి మురళిని రాయితో కొట్టి చంపిన కుమారుడు రాజేష్.
Nizamabad: కన్న తండ్రిని చంపిన కొడుకు.. మద్యం మత్తులో ఘాతుకం
Nizamabad: నవీపేట్ మండలం ఫకీరాబాద్ జిపి పరిధిలోని మాన్సింగ్ తండాలో తండ్రిని హతమార్చిన తనయుడు. ఎస్ ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం మాన్సింగ్ తండాకు చెందిన మురళి రాథోడ్ 48 అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మురళికి రాజేష్ మద్యానికి బానిసై మద్యం మైకంలో తల్లి లక్ష్మి పై దాడి చేశాడు.
అడ్డు వచ్చినా పిన్నిని సైతం కొట్టడంతో తండ్రి మురళి రాజేష్కు మంద లించడంతో తండ్రిపై కక్ష పెంచుకున్న రాజేష్ మత్తులో మంగళవారం మధ్యాహ్నం తలపై రాయితో బలంగా కొట్టడంతో మురళి కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రాజేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.
రాజేష్ జూలైగా తిరిగేవాడు. మద్యం కు బానిసైన రాజేష్ తండ్రి సంపాదన మీదనే మద్యం సేవిస్తూ తిరిగేవాడని గ్రామస్తులు తెలిపారు. రాజేష్ ప్రవర్తన మార్పు కోసం పలు ప్రాంతాలకు వలస సైతం వలస వెళ్లినట్లు అయినా రాజేష్ లో మార్పు రాకపోవడంతో తిరిగి సొంత గ్రామానికి వచ్చారని తాండవాసులు వివరించారు.




