Armoor: ఆర్మూర్ సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు!

Armoor: ఆర్మూర్ మామిడిపల్లి సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు.

VAMSHI, ARMOOR
Published on: 3 Nov 2026 8:39 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు!

ఆర్మూర్: ఆర్మూర్‌ పట్టణ మామిడిపల్లి సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో ని 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 03-11-2026 న తొలిసారిగా స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, క్రమశిక్షణ, సేవాభావం మరియు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో వివిధ విభాగాలకు సంబంధించి విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల విద్యార్థి నాయకులుగా ఎన్నుకున్నారు.

ఎన్నికైన విద్యార్థి నాయకుల వివరాలు:

హెడ్ బాయ్ (Head Boy): అచ్యుత్.టి (Achyuth.T)

డిప్యూటీ హెడ్ గర్ల్ (Deputy Head Girl): ప్రస్తుతి.ఎస్ (Prasthuthi.S)

టెక్నికల్ హెడ్ (Technical Head): డోరా వాలెన్సియా.బి (Dora Valancia.B)

స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లీడర్ (Sports & Cultural Leader): ఎం. శ్రీశాన్వి (M. Srishanvy)

టీచర్ రిప్రజెంటేటివ్ (Teacher Representative): శ్రీమతి సుమలత పడాల (Mrs. Sumalatha Padala), తెలుగు ఉపాధ్యాయురాలు.

ముఖ్యంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బి. ఇనాక్ పాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి సిసిలియా పాల్ గారు అందించిన ప్రోత్సాహం, సహకారం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో దోహదపడ్డాయి.

సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో తొలిసారిగా నిర్వహించిన ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు విద్యార్థుల్లో నాయకత్వ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ప్రవర్తన మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించేందుకు చక్కని వేదికగా నిలిచాయి.

ఈ ఎన్నికలను విజయవంతం చేయడానికి కృషి చేసిన పాఠశాల యాజమాన్యానికి, కరస్పాండెంట్ , వైస్ ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ బృందానికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ మరియు ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులందరికీ పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

విద్యార్థి నాయకత్వానికి నాంది – బాధ్యతాయుతమైన భవిష్యత్తుకు పునాది!

ఈ కార్యక్రమంలో సెంటు పాల్ స్కూల్ ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్, టీచర్స్,స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR