Kamareddy: డీపీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆకస్మిక తనిఖీ!

Kamareddy: రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వైద్యాధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణపై జూమ్ సమీక్ష జరిపారు.

Rohith
Published on: 29 July 2026 8:37 PM IST
Kamareddy
X

Kamareddy: డీపీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆకస్మిక తనిఖీ!

కామారెడ్డి: కామారెడ్డిజిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యాచరణ మరియు సంసిద్ధత ఇతర ఆరోగ్య కార్యక్రమాల గురించి సమీక్ష కోసం ఈ రోజు రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ సంచాలకులు డా.రవీందర్ నాయక్ గారు కామారెడ్డి జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు ...ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భిక్నూర్ ను తనిఖీ చేసినారు.

ఇట్టి ఆరోగ్య కేంద్రం లో అందుతున్న సేవల గురించి అక్కడి ప్రజలను అడిగి తెలుకున్నారు మరియు ఇక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యాధికారి డా.ఏమీమా గారిని ప్రశంసించారు.... తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లాలోని వైద్యాధికారుల తో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ గురించి చేపట్టవలసిన చర్యల గురించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గురించి ముందు జాగ్రత్త చర్యల గురించి తగు ఆదేశాలు జారీ చేస్తూ మార్గదర్శనం చేసినారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటి , ప్రోగ్రాం ఆఫీసర్లు డా.రాజు, డా.వెంకటస్వామి ,డా.రోహిత్ , డా.ప్రదీప్, డా.నర్సింగ్ చౌహాన్, ఏ.ఎం.ఓ.శ్రీనివాస్ రెడ్డి, డెమో.మహేందర్ రెడ్డి, హెచ్.ఈ. వేణుగోపాల్ పాల్గొన్నారు.

Rohith

Rohith

Next Story