Bodhan: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఏసీపీ
Bodhan: బోధన్‌లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
Bodhan: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఏసీపీ
బోధన్: మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులు, వాహనాల యజమానులపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ వలి పేర్కొన్నారు.
బోధన్ పట్టణంలోని లైన్స్ క్లబ్ లో మంగళవారం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, పలువురు ప్రజా ప్రతినిధులతో ట్రాఫిక్ నిబంధనలపై పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి మాట్లాడుతూ మైనార్టీ తీరని విద్యార్థులకు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే జరగకూడని ప్రమాదాలు జరిగినట్లయితే వారి మూలంగా తల్లిదండ్రులకు సైతం ఇబ్బందులు తప్పవ న్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు మైనర్ బాలుల మూలంగానే అత్యధికంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు సైతం విద్యార్థులకు పలు సలహాలు సూచనలు అందించడంతోపాటు వారి తల్లిదండ్రులకు సైతం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. నిబంధన అతిక్రమించిన వారిపై ప్రభుత్వం వారికి 25 ఏళ్ల వయస్సు వచ్చేవరకు లైసెన్సును ఇవ్వకూడదని నిబంధనలు చెబుతున్నాయన్నారు.
మైనర్ల మూలంగా జరుగుతున్న అనర్థాల గురించి ఆయన వివరించి అవగాహన కల్పించారు. సౌండ్ పొల్యూషన్ వాహనాలను వినియోగించడం నేరమని వాటిని రోడ్లపై నడిపినట్లయితే కఠిన చర్యలు తప్పమన్నారు.
ఈ సదస్సులో బోధనీసిపి శ్రీనివాసరావు మాట్లాడుతూ బోధన్ పట్టణంతోపాటు వివిధ మండలాల్లోని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రులకు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ప్రభుత్వం కనీ చర్యలు తీసుకోవాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సదస్సులో ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షులు ఇందూర్ మోడల్ స్కూల్ విద్యాసంస్థల అధినేత కొడాలి కిషోర్, వివిధపాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.




