Kamareddy: ఘనంగా ముగిసిన విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు!

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద న్యూ అర్కిడ్స్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం 'సక్సెస్ ఆపరేటింగ్ సిస్టమ్'పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 12 Aug 2026 1:42 PM IST
Kamareddy
X

Kamareddy: ఘనంగా ముగిసిన విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు!

Kamareddy: ఎస్సేస్సి పరీక్షలకు సిద్దమౌతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపోందించి, ఉత్తమ ఫలితల దిశగా నాడ్పించెందుకు గాను బుధవారం బిచ్కుంద పట్టణంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.'సక్సెస్ ఆపరేటింగ్ సిస్టమ్'పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లోవిశేష ఉత్సహన్ని నింపింది.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని న్యూ అర్కిడ్స్ పాఠశాలలో ఎస్సేస్సి విద్యార్థులకు రెండు గంటల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రొమైండ్స్ అధినేత, వ్యక్తిత్వ వికాస నిపుణులు కె. గంగాధర్ 'సక్సెస్ ఆపరేటింగ్ సిస్టమ్ 'అంశంపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్బంగా లక్ష్య నిర్దేశం, సమయ నిర్వహణ, ఏకగ్రత, క్రమ శిక్షణ, ఆత్మవిశ్వసం , పరీక్షల సమయంలో ఒత్తిడి ని ఆదిగమించే పద్ధతులు, సమర్ధవంతమైన పరీక్ష ప్రణాళిక వంటి అంశాలపై విద్యార్థులకు ఆచార్నాత్మక సూచనలు అందించారు.

ప్రశ్నలు, చర్చలు,వివిధ కార్యకలాపాల ద్వార విద్యార్థులను చురుకుగా పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పష్టమైన లక్ష్యం, సరైన ప్రణాళిక, క్రమశిక్షణ తో సాధన చేస్తే ఎస్సేస్సి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని గంగాధర్ తెలిపారు. కార్యక్రమం విజయవంతనికి న్యూ అర్కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ గోపి, యాజమాన్యం సహకారం అందించారు.

విద్యార్థుల విద్య ప్రగతి తో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వసం, భవిషత్తు నైపుణ్యాల అభివృద్ధి కి ఇటువంటి కార్యక్రమాలు దోహద పడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తు లో కూడా విద్యార్థులకు ఉపయోగపడే నైపుణ్యభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story